Manipur Violence | పార్లమెంట్లో మణిపూర్ ప్రకంపనలు : రాజ్యసభ నుంచి విపక్షం వాకౌట్
పార్లమెంట్లో మణిపూర్ (Manipur Violence) ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈశాన్య రాష్ట్రంలో హింసాకాండపై చర్చకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో గురువారం విపక్షాలు ఆందోళన చేపట్టాయి.
న్యూఢిల్లీ : పార్లమెంట్లో మణిపూర్ (Manipur Violence) ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఈశాన్య రాష్ట్రంలో హింసాకాండపై చర్చకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో గురువారం విపక్షాలు ఆందోళన చేపట్టాయి. మణిపూర్ అంశాన్ని లేవనెత్తేందుకు స్పీకర్ అంగీకరించకపోవడంతో కాంగ్రెస్, ఆర్జేడీ, టీఎంసీ, ఆప్, సీపీఐ, సీపీఎం సహా విపక్షాలు రాజ్యసభ నుంచి వాకౌట్ చేశాయి.
ప్రధాని సభకు రావాలని కోరుతూ వాకౌట్కు ముందు విపక్ష ఎంపీలు సభలో నినాదాలతో హోరెత్తించారు. మణిపూర్ అంశంపై చర్చ చేపట్టాలని కోరుతూ గత కొద్దిరోజులుగా విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ ఉభయసభలూ దద్దరిల్లుతున్నాయి. ఈ వ్యవహారంపై చర్చకు పట్టుబడుతూ గురువారం రెండోసారి విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.
మరోవైపు లోక్‌సభలోనూ మణిపూర్ అంశంపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. కాగా, మణిపూర్, హరియాణలో హింసాకాండపై బీజేపీ ప్రభుత్వం లక్ష్యంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విమర్శలు గుప్పించారు. లోక్‌సభలో బీజేపీనే గందరగోళం సృష్టిస్తోందని, కాషాయ నేతలకు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని మండిపడ్డారు. బీజేపీ ఎంపీలు పార్లమెంట్‌ను అపహాస్యం చేస్తున్నారని, ఆ పార్టీ ప్రతి చోటా విభజించి పాలించే రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.
Read More :
Fake Univerisities | ఈ 20 యూనివర్సిటీల్లో అస్సలు చేరకండి.. స్టూడెంట్స్‌కు యూజీసీ వార్నింగ్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

