న్యూఢిల్లీ, ఆగస్టు 20: కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ(130వ సవరణ) బిల్లు, 2025 ప్రకారం ఐదేళ్లు అంతకు మించి శిక్ష పడే అవకాశం ఉన్న నేరాలకు సంబంధించిన కేసులలో అరెస్టయి వరుసగా 30 రోజులకు మించి కస్టడీలో ఉన్న పక్షంలో రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు లేదా మంత్రులను పదవి నుంంచి తొలగించే విశేషాధికారాన్ని గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు ఈ వివాదాస్పద బిల్లులు కల్పిస్తున్నాయి.