ఓట్ల చోరీ, బీహార్లో ఈసీ చేపట్టిన ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్)కు వ్యతిరేకంగా మంగళవారం పార్లమెంట్ వద్ద ఇండియా కూటమి నిరసనలు కొనసాగాయి.
బీహార్ ఓటర్ల జాబితాలో ‘124 ఏండ్ల ఓటరు’ పేరు ఉందంటూ, సదరు ఓటరు ఫొటో ముద్రించిన టీ షర్టులతో ఆ కూటమి ఎంపీలు ధర్నా చేశారు.