న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ పోగట్‌పై అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. అధిక బరువు వల్ల ఆమెను ఫైనల్ నుంచి డిస్క్వాలిఫై చేశారు. ఈ అంశంపై చర్చించాలని ఇవాళ రాజ్యసభ(Rajya Sabha)లో ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఆ సమయంలో సభలో గందరగోళం నెలకొన్నది. విపక్షాలు గట్టిగా నినాదాలు చేశాయి. వినేశ్ పోగట్ అంశంపై చర్చ చేపట్టేందుకు .. రాజ్యసభ చైర్మెన్ జగదీప్ ధనకర్ నిరాకరించారు. టీఎంసీ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్‌పై తీవ్ర స్థాయిలో ఆయన ధ్వజమెత్తారు. మీరు చైర్‌పై అరుపులు పెడుతున్నారని, ఇలాంటి ప్రవర్తనను ఖండిస్తున్నానని, ఎవరైనా అలా ప్రవర్తిస్తారా అని చైర్మెన్ జగదీప్ ధన్కర్ ప్రశ్నించారు.
ఇక వినేశ్ పోగట్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఆ రెజ్లర్ విషయంలో కేవలం తాము మాత్రమే బాధపడుతున్నట్లు ప్రతిపక్షాలు ప్రవర్తిస్తున్నట్లు చైర్మెన్ జగదీప్ ఆరోపించారు. ఆ అమ్మాయికి జరిగిన అన్యాయం పట్ల యావత్ దేశం బాధతో ఉందన్నారు. ఆ విషయాన్ని ప్రతి ఒక్కరూ షేర్ చేసుకుంటున్నట్లు చెప్పారు. కానీ దాన్ని రాజకీయం చేయాలని కొందరు చూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలా చేయడం అంటే ఆ రెజ్లర్‌ను అవమానించడమే అవుతుందని, ఆమె ఇంకా ఎంతో భవిష్యత్తు ఉన్నట్లు జగదీప్ తెలిపారు.
Earlier, Rajya Sabha Chairman Jagdeep Dhankhar condemned the behaviour of TMC MP Derek O’ Brien- “You are shouting at the Chair. I condemn this behaviour. Can anyone countenance such conduct?…” https://t.co/qRUlgnD63J
— ANI (@ANI) August 8, 2024