న్యూఢిల్లీ: కొత్త కార్మిక చట్టాల(Labour Laws)ను వ్యతిరేకిస్తూ ఇవాళ ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. లోక్‌సభలో కొత్త లేబర్ చట్టాలపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాకూర్ వాయిదా తీర్మానం అందజేశారు. ఇటీవల కేంద్ర సర్కారు నాలుగు లేబర్ కోడ్లను ప్రకటించింది. కోడ్ ఆఫ్ వేజెస్ 2019, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020, కోడ్ ఆన్ సోషల్ సెక్యూర్టీ 2020, ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్, వర్కింగ్ కండీషన్స్ కోడ్‌ను అమలు చేయనున్నారు. నవంబర్ 21వ తేదీ నుంచి కొత్త కార్మిక చట్టాలను అమలులోకి తెచ్చారు. పార్లమెంట్ ఆవరణలో ఇవాళ భారీ బ్యానర్‌తో నిరసన చేపట్టారు. కార్పొరేట్ జంగిల్ రాజ్‌కు నో చెప్పాలని ఆ బ్యానర్లో డిమాండ్ చేశారు.
#WATCH | Delhi | Opposition leaders protest against Labour laws in Parliament premises pic.twitter.com/K8wtZdJtAH
— ANI (@ANI) December 3, 2025