న్యూఢిల్లీ: సీబీఎస్ఈ బోర్డు నిర్లక్ష్యం కారణంగా దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయి ఇబ్బందులు పడుతుంటే కేంద్రం కేవలం బోర్డు చైర్మన్, కార్యదర్శిని బదిలీ చేయడం కంటితుడుపు చర్య మాత్రమేనని విపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఇద్దరు ఉన్నతాధికారులను బదిలీ చేయడం ద్వారా నిజమైన దోషిని కేంద్రం భద్రంగా ఉంచిందని విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అధికారుల బదిలీ వారికి శిక్షా లేక రక్షణా అని ఆప్ నేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.