జైపూర్: ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) చేపట్టి నేటితో ఏడాది పూర్తి అయ్యింది. పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో.. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద కేంద్రాలను ఇండియన్ మిలిటరీ ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జైపూర్‌లో ఇవాళ జరిగిన ఓ కార్యక్రమంలో త్రివిధ దళాలకు చెందిన చీఫ్‌లు మీడియా సమావేశంలో మాట్లాడారు. పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్ర స్థావరం ఏది కూడా సురక్షితమైంది కాదు అని ఆపరేషన్ సింధూర్ ద్వారా నిరూపించామని భారతీయ మిలిటరీ పేర్కొన్నది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చేపట్టిన ఆ మిషన్ కేవలం ప్రారంభం మాత్రమే అని మిలిటరీ చెప్పింది. ఆపరేషన్ సింధూర్‌కు చెందిన వివిధ రకాల అంశాలను ఎయిర్‌ఫోర్స్, నేవీ, ఆర్మీకి చెందిన చీఫ్‌లు వెల్లడించాయి. ఆపరేషన్ సింధూర్ ముగింపు కాదు అని, అది ఆరంభం మాత్రమే అని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ తెలిపారు.
డీజీఎంవో స్థాయిలో ఆ ఆపరేషన్‌ను ఘాయ్ చేపట్టారు. నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని ఉన్న పాకిస్థానీ స్థావరాలను ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా ధ్వంసం చేసినట్లు చెప్పారు. చాలా కచ్చితత్వంతో ఆ ఆపరేషన్ చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. భారత తన సార్వభౌమాధికారాన్ని, భద్రతను, ప్రజలను కాపాడుకుంటుందని ఆయన తెలిపారు. పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్ర స్థావరాలు ఏవి కూడా క్షేమం కాదు అని ఆపరేషన్ సింధూర్‌తో తెలిసిందన్నారు. ప్లాన్ చేశామని, పక్కాగా అమలు చేశామని, మల్టీ డొమెయిన్ ఆపరేషన్‌ను అసాధారణ రీతిలో పూర్తి చేశామని ఘాయ్ తెలిపారు.
ఎయిర్ మార్షల్ ఏకే భారతి మాట్లాడుతూ.. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ తన వైమానిక సత్తా చాటిందన్నారు. పాకిస్థాన్‌తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై మే 7వ తేదీన దాడి చేశామన్నారు. మే 10వ తేదీన రెండు దేశాల మధ్య మధ్యవర్తితత్వం కుదిరిందన్నారు.
#WATCH | Jaipur, Rajasthan: At the press conference on the anniversary of Operation Sindoor, Lt Gen Rajiv Ghai says, “… Operation is still going on means, making preparations and the preparations that are going on… We have imbibed some lessons during Operation Sindoor, and… pic.twitter.com/f3MuU6RcPj
— ANI (@ANI) May 7, 2026