జడ్చర్లటౌన్, జూలై 24 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించడంలో పూర్తిగా విఫలయ్యాయని మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో పోరాడుతున్న విద్యార్థులపై బీజేపీ సర్కారు కొనసాగిస్తున్న అణచివేతకు నిరసనగా శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో తలపెట్టిన మహాధర్నాకు జడ్చర్లకు చెందిన బీఆర్ఎస్వీ విభాగం నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా మ హాధర్నా కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి పాల్గొన్న మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని జడ్చర్ల బీఆర్ఎస్ శ్రేణు లు కలిసి ధర్నాలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తమ భవిష్యత్ కోసం న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్న విద్యార్థులు, యువతకు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సంఘీభావం ప్రకటించారు. దేశంలో యువ త, విద్యార్థులకు భరోసా లేకుండా పోయిందన్నారు. అందుకే తమ భవిష్యత్ కోసం విద్యార్థులు రోడ్లపైకొచ్చి పోరాటం చేస్తున్నారన్నా రు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించటంలో విఫలమవటమే కాకుండా విద్యార్థుల భవిష్యత్‌తో చెలాగాటం ఆడుతున్నాయని విమర్శించారు. దేశంలోని యువతకు బీఆర్ఎస్ భరోసా ఇస్తుందని, వారి పోరాటానికి మద్దతు తెలుపుతూ కలిసి నడుస్తామని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వాల్యానాయక్, కోడ్గల్ యాదయ్య, ఇంతియాజ్, సోహేల్, బాలు, కరాటే శ్రీను, నాగిరెడ్డి, శ్రీనివాస్‌యాదవ్, కొండల్, పాల్గొన్నారు.