కేంద్ర మంత్రులకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల విజ్ఞప్తులు
ఢిల్లీ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొనింటి మాణిక్‌రావు శుక్రవారం రెండోరోజు కేంద్ర మంత్రులను కలిశారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్రతో కలిసి కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతి పత్రం అందజేశారు.
సంగారెడ్డి కలెక్టరేట్/జహీరాబాద్, జూలై 24: ఢిల్లీ పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొనింటి మాణిక్‌రావు శుక్రవారం రెండోరోజు కేంద్ర మంత్రులను కలిశారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్రతో కలిసి కేంద్ర రోడ్లు, ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతి పత్రం అందజేశారు. జాతీయ రహదారి 65పై ప్రమాదాల నివారణ కోసం నిజాంపూర్ ఎక్స్ రోడ్డు, ఆరూర్ జంక్షన్ల వద్ద ఫ్లెఓవర్లు నిర్మించాలని కోరారు.
11వ శతాబ్దపు నందికంది, కులబ్గూర్ పురాతన ఆలయాలను హెరిటేజ్ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసి నిధులు కేటాయించాలని పర్యాటక శాఖ మంత్రి షెకావత్‌కు విజ్ఞప్తి చేశారు. వందలాది పక్షి జాతులకు నిలయమైన మంజీరా డ్యామ్‌ను అమృత్ ధరోహర్ కింద జాతీయ స్థాయి ఎకోటూరిజం కేంద్రంగా మార్చాలని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌కు ప్రతిపాదన అందజేశారు. మంజీరా వన్యప్రాణి అభయారణ్యం సుమారు 313 పక్షి జాతులకు, వీటిలో 117 వలస పక్షుల నిలయమని, డ్యామ్‌లో 9 సహజ ద్వీపాల పక్షులు, ఇతర వన్య ప్రాణుల సంతానోత్పత్తికి ఎంతో అనువైన అవాసాలుగా ఉన్నాయని ఎమ్మెల్యేలు తెలిపారు.
మంజీరా వెట్ ల్యాండ్‌కు ప్రతిష్టాత్మక రామ్సార్ గుర్తింపు తీసుకురావాలని కోరారు. కొండాపూర్ పురావస్తు మ్యూజియాన్ని జాతీయ స్థాయి వారసత్వ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. జహీరాబాద్-బీదర్ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించి, నాలుగు లేన్లుగా విస్తరించాలని కోరారు. కోహీర్ మండలం దిగ్వాల్ వద్ద ప్రతి పాదించిన ఫ్లై ఓవర్ అండర్ పాస్‌ను 30 మీటర్లకు పొడిగించి, సర్వీసు రోడ్లు నిర్మించాలని ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. వారివెంట డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శివకుమార్ ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

