ATGM Missile | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ): సరిహద్దుల్లో శతఘ్నులు, భారీ మెషిన్ గన్స్‌తో దాడులకు పాల్పడుతున్న పాక్ రేంజర్లకు భారత్‌కు చెందిన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ (ఏటీజీఎం) చుక్కలు చూపిస్తున్నది. దాడులు చేసి నక్కేందుకు పాక్ రేంజర్లు ఏర్పాటు చేసుకొన్న బంకర్లను ఏటీజీఎం భస్మీపటలం చేస్తున్నది.
పేరు: ఏటీజీఎం
ఎందుకు వాడుతారు?: ఆయుధాలు కలిగిన వాహనాలు, బంకర్లు, యుద్ధ ట్యాంకులను నాశనం చేయడానికి..
పరిధి: 1.5 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల వరకు
ఎలా పనిచేస్తుంది?: రెండు వార్‌హెడ్స్ ఉంటాయి. తొలి దాడిలో శత్రు ట్యాంక్ బయటి కవచం నాశనమౌతుంది. రెండో దాడిలో ట్యాంక్ ధ్వంసమవుతుంది.
ఎలా ప్రయోగించాలి?: భుజం మీద నుంచి లేదా ట్రైపోడ్, వాహనాలపై అమర్చి వాడొచ్చు.
ప్రత్యేకత: ఒక్కసారి బంకర్ లేదా టార్గెట్‌ను లాక్ చేస్తే.. దానంతట అదే లక్ష్యాన్ని వెంటాడి ఛేదిస్తుంది.