Operation Sindoor | చైనాలోని భారత రాయబార కార్యాలయం ప్రభుత్వ యాజమాన్యంలో గ్లోబల్ టైమ్స్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సోషల్ మీడియాలో భారతదేశం-పాకిస్తాన్‌కు సంబంధించిన వార్తలను పబ్లిస్ చేసే ముందు.. చేసే ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాలని సూచించింది. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ సైన్యం మెరుపుదాడులు చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా ‘ఎక్స్’ పోస్ట్‌లో భారత రాయబార కార్యాలయం గ్లోబల్ టైమ్స్ వార్త కథనాలపై మండిపడింది. తప్పుడు సమాచాన్ని వ్యాప్తి చేయొద్దని.. ఏదైనా సమాచారాన్ని పబ్లిష్ చేసే ముందు వాస్తవాలను తెలుసుకోవాలని.. ఆ తర్వాత ఏదైనా రాసుకోవాలని సూచించింది. పాకిస్తాన్‌కు మద్దతుగా పనిచేస్తున్న అనేక సోషల్ మీడియా గ్రూప్స్ భారత్‌కు వ్యతిరేకంగా తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నాయని భారత రాయబార కార్యాలయం పేర్కొంది.
ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సందర్భంలో ప్రజలను తప్పుదారి పట్టించేలా పోస్టులు చేస్తున్నారని.. నిరాధారమైన వార్తలు వ్యాప్తి చేస్తున్నారని తెలిపింది. అలాంటి తప్పుడు వార్తలను వ్యాప్తి చేయకపోవడం మీడియా సంస్థల విధి అని చెప్పింది. భారత ప్రభుత్వం ఐపీబీ ఫ్యాక్ట్ చెక్ పోస్టును ఊదహరించింది. భారత్‌కు చెందిన రఫేల్ జెట్‌ను పాక్ కూల్చిందంటూ.. పాక్ అనుకూల గ్రూపులు సోషల్ మీడియాలో వైరల్ చేసినట్లు పేర్కొంది. వాస్తవానికి అది 2021 సంవత్సరం నాటిదని.. పంజాబ్‌లోని మోగా జిల్లాలో భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం కూలిపోయిన చిత్రమని పేర్కొంది. ఇలాంటి తప్పుదారి పట్టించే వార్తలు, ఫొటోలు వీడియోలపై చర్యలు తీసుకుంటామని.. ముఖ్యంగా జాతీయ భద్రత, సైన్యానికి వ్యతిరేకంగా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవని భారత్ హెచ్చరించింది.
(1/n) Dear @globaltimesnews , we would recommend you verify your facts and cross-examine your sources before pushing out this kind of dis-information. https://t.co/xMvN6hmrhe
— India in China (@EOIBeijing) May 7, 2025