Madras High Court: ఎస్సీ కోటాలో ఆ మతస్థుల వారికే పోటీపడే అవకాశం ఇవ్వాలి.. మద్రాసు హైకోర్టులో పిల్ దాఖలు
Madras High Court: హిందువులు, బౌద్ధులు, సిక్కు మతస్థులకు మాత్రమే ఎస్సీ కోటా వర్తిస్తుందని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ మద్రాసు హైకోర్టులో ఓ పిల్ దాఖలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ సీట్లలో కేవలం ఆ మూడు మతస్థుల వారు మాత్రమే పోటీపడే విధంగా ఈసీ చర్యలు తీసుకోవాలని పిల్లో కోరారు.
చెన్నై: హిందువులు, బౌద్ధులు, సిక్కు మతస్థులకు మాత్రమే ఎస్సీ కోటా వర్తిస్తుందని ఇటీవల సుప్రీంకోర్టు ఓ తీర్పు సందర్భంగా క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ మద్రాసు హైకోర్టులో ఓ పిల్ దాఖలైంది. తమిళనాడులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎస్సీ రిజర్వేషన్ స్థానాల్లో కేవలం ఆ మూడు మతస్థుల వారికే పోటీపడే ఛాన్సు ఇవ్వాలని పిల్లో కోరారు. తమిళనాడులో మొత్తం 44 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి. అయితే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్లు.. ఆ ఎస్సీ కోటా అభ్యర్థులు ఏ మతానికి చెందినవారో స్పష్టంగా తెలుసుకోవాలని పిల్లో కోరారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ఎన్నికల అధికారికి ఆదేశాలు ఇవ్వాలని మద్రాసు హైకోర్టును పిల్లో కోరారు. కేవలం హిందు, సిక్కు, బౌద్ద మతంలో ఉన్న ఎస్సీలకు మాత్రం కేటగిరీ కోటా సీట్లు ఇవ్వాలని, ఇతర మతాల్లోని ఎస్సీలను తిరస్కరించాలని పిల్లో పేర్కొన్నారు. ఇరు మక్కల్ కచ్చి వ్యవస్థాపక అధ్యక్షుడు అర్జునన్ సంపత్ పిల్‌ను దాఖలు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pinarayi Vijayan | కేరళ మాజీ సీఎం పినరయి విజయన్‌కు ఈడీ సమన్లు.. మనీ లాండరింగ్ కేసులో అక్టోబర్ 23న విచారణ
విద్యుత్ ఉపకేంద్రం నిర్మాణానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
Donation | కొమురం భీమ్ విగ్రహావిష్కరణకు బీఆర్ఎస్ నాయకుడు విరాళం
IT Park | చౌటుప్పల్ ఐటీ పార్కులో భారీ పేలుడు.. వ్యక్తి మృతి
పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా రాపోలు పరమేశ్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

