లక్నో : జనవరి 22న అయోధ్య రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు (Ram Mandir Consecration) ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి 3000 మంది వీఐపీలు సహా 7000 మందిని ఆహ్వానించారు. అత్యంత ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నా రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగే సమయంలో గర్భ గుడిలోకి కేవలం ఐదుగురినే అనుమతిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ఆలయ ప్రధాన పూజారి మాత్రమే గర్భ గుడిలో పూజలు నిర్వహిస్తారు.
ఈ సమయంలో గర్భగుడి కర్టెన్లు మూసివేస్తారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖేష్ అంబానీ, గౌతం అదానీ, రతన్ టాటా, అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్, రజనీ కాంత్, సంజయ్ లీలా భన్సాలీ సహా పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముగ్గురు ఆచార్యుల నేతృత్వంలోని బృందాలు నిర్వహిస్తాయి.
This video gives Goosebumps 🔥
Can't wait for #Ayodhya Ram Mandir to be open
22nd January, 2024 : HISTORY WILL WITNESS THE LORD'S COMEBACK TO HOME.#JaiShriRam JAI SIYA RAM pic.twitter.com/SwKQzmbHaH— Anand Abhirup 📌 🧡 🦩 (@SanskariGuruji) December 29, 2023
స్వామి గోవింద్ దేవ్ గిరి, శంకరాచార్య విజయేంద్ర సరస్వతి, కాశీ నుంచి తరలివచ్చే స్కాలర్స్ నేతృత్వంలో ఈ మూడు బృందాలు క్రతువును చేపడతాయి. ఇక జనవరి 22న అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. డిసెంబర్ 30న ప్రధాని అయోధ్యను సందర్శించి నూతనంగా నిర్మించిన ఎయిర్పోర్ట్ను ప్రారంభిస్తారు. నూతన రైలు సర్వీసునూ ఆయన ప్రారంభించనున్నారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ 2020లో నూతన రామ మందిర నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు.
Read More :
Municipal Council | మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో కౌన్సిలర్ల పిడిగుద్దులు.. వీడియో