Sabarimala | తిరువనంతపురం, అక్టోబర్ 5: ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న భక్తులను మాత్రమే శబరిమలకు అనుమతించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి శబరిమలలో వార్షిక మండలం-మకరవిలక్కు యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన సమావేశం జరిగింది. శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులు ముందుగా ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవాలని సీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతి రోజూ 80 వేల మంది భక్తులకు దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది.