న్యూఢిల్లీ : ఆనియన్ పకోడీ ఆపై కడక్ ఛాయ్ ఈ కాంబినేషన్ అంటే ఇష్టపడని వారుండరు. బయట జోరున వర్షం పడుతుంటే ఇలాంటి ఆహారం అంటే (Viral Pics) అందరూ లొట్టలేసుకుని తింటారు. ఇలాంటి బ్యూటిఫుల్ వెదర్లో పకోడీ, వడ, ఛాయ్ కాంబినేషన్‌ను ఎవరు కాదంటారు. పారిశ్రామికవేత్త హర్ష్ గోయంకా సైతం రెయినీ సండే బ్రేక్‌ఫాస్ట్‌గా ఇలాంటి హాట్ ఫుడ్‌నే ఎంచుకున్నారు.
My breakfast today with the monsoon rains for company. Onion bhajias, kadak chai, achappams,vadas and all things sinful from the thalassery region in a dhaba like atmosphere created by @MasqueBombay pic.twitter.com/Sx3vieV8xS
— Harsh Goenka (@hvgoenka) June 25, 2023
ఆరోజు గోయంకా కొన్ని ఆనియన్ పకోడీలు, కడక్ ఛాయ్, వడలను అల్పాహారంగా తీసుకున్నారు. స్ట్రీట్ సైడ్ దుకాణంలో ఆయన తీసుకున్న డిష్‌ల ఫొటోలను కూడా సోషల్ మీడియాలో హర్ష్ గోయంకా షేర్ చేశారు.
తొలకరి వర్షాల్లో నా బ్రేక్‌ఫాస్ట్ ఏంటంటే..మాస్క్యూబాంబే సృష్టించిన ధాబా లాంటి వాతావరణంలో తలస్సేరి ప్రాంతం నుంచి ఉల్లిపాయ బజ్జీలు, కడక్ చాయ్, అచ్చప్పమ్లు, వడలు ఆస్వాదించా అంటూ హర్ష్ గోయెంకా కొన్ని ఫోటోలతో పాటు ట్వీట్ చేశారు. హర్ష్ గోయంకా సండే బ్రేక్‌ఫాస్ట్‌ను పలువురు నెటిజన్లు ఇష్టపడ్డారు. వర్షాకాలంలో ఇంతకన్నా మంచి బ్రేక్‌ఫాస్ట్ ఏముంటుందని పలువురు నెటిజన్లు కామెంట్స్ సెక్షన్లో రాసుకొచ్చారు.
Read More :
Indian Army: మణిపూర్ మహిళలకు విజ్ఞప్తి.. వీడియో రిలీజ్ చేసిన ఆర్మీ