ONGC | కృష్ణా గోదావరి బేసిలో ముడి చమురు ఉత్పత్తి షురూ..! సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని..!
ONGC | కృష్ణా గోదావరి బేసిన్లో ముడి చమురు ఉత్పత్తిని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) ప్రారంభించింది. ఈ విషయాన్ని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు. కేజీ డీ డబ్ల్యూఎస్ 98/2 బ్లాక్‌లో తొలిసారిగా చమురు ఉత్పత్తి జరిగినట్లు కేంద్రమంత్రి ప్రకటించారు.
ONGC | కృష్ణా గోదావరి బేసిన్లో ముడి చమురు ఉత్పత్తిని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) ప్రారంభించింది. ఈ విషయాన్ని పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు. బంగాళాఖాతంలో కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో కేజీ డీ డబ్ల్యూఎస్ 98/2 బ్లాక్‌లో తొలిసారిగా ఆదివారం చమురు ఉత్పత్తి జరిగినట్లు కేంద్రమంత్రి ప్రకటించారు. బ్లాక్ నుంచి ప్రతిరోజూ 45వేల బ్యారెల్స్‌కు క్రూడాయిల్‌ను ఉత్పత్తి అవుతుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ స్థాయిలో ఉత్పత్తికి చేరుకునేందుకు కొంత సమయంపడుతుందన్నారు. ఈ ప్రాజెక్టులో ప్రస్తుతం దేశం మొత్తం చమురు ఉత్పత్తిలో 7శాతం, న్యాచురల్ గ్యాస్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నది. ఓఎన్జీసీకి అనుబంధంగా మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్‌కు ముడి చమురును పంపనున్నారు. అక్కడ ముడి చమురు నాణ్యతను పరిశీలించి గ్రేడింగ్ నిర్ణయిస్తారు.
ప్రస్తుతం చమురువు వెలికి తీస్తున్న కృష్ణా గోదావరి బేసిన్ ప్రాజెక్టు బంగాళాఖాతం డెల్టా భాగం, ఆంధ్రప్రదేశ్ ప్రాదేశిక జలాలకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ ప్రాజెక్టును మూడు క్లస్టర్లుగా విభజించారు. ప్రస్తుతం క్లస్టర్-2లో చమురు ఉత్పత్తిని ప్రారంభించారు. కృష్ణా గోదావరి బేసిన్లో ముడి చమురు ఉత్పత్తి చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారత్‌కు కీలకమైన ముందడుగు అని.. దేశ స్వావలంభన మిషన్‌కు ప్రోత్సాహాన్ని ఇస్తుందన్న ఆయన.. దేశ ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

