OneWeb Satellites: ఇస్రోతో కలిసి 36 శాటిలైట్లను ప్రయోగించనున్న వన్‌వెబ్
OneWeb satellites: వన్‌వెబ్ మళ్లీ శాటిలైట్లను లాంచ్ చేయనున్నది. 36 శాటిలైట్లను ప్రయోగించేందుకు సిద్దమైంది. ఈనెల 26వ తేదీన శ్రీహరికోట నుంచి ఆ ప్రయోగం జరిగే అవకాశాలు ఉన్నాయి.
హైదరాబాద్: భారతీ ఎంటర్‌ప్రైజస్(Bharti Enterprises) ప్రోత్సాహంతో వన్‌వెబ్(OneWeb) కంపెనీ .. ఇస్రో సహాయంతో 36 ఇంటర్నెట్ శాటిలైట్ల(Satellites)ను ప్రయోగించనున్నది. మార్చి 25వ తేదీన ఆ ప్రయోగం జరగనున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. గ్లోబల్ ఎల్ఈవో కాన్స్టెల్లేషన్లో భాగంగా ఆ ప్రాజెక్టును చేపట్టారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(Satish Dhawan Space Station) నుంచి ఆ శాటిలైట్లను ప్రయోగిస్తారు. ఇప్పటి వరకు వన్‌వెబ్ సంస్థ 18 సార్లు శాటిలైట్లను ప్రయోగించింది. ఈ ఏడాది ఇది మూడవ పరీక్ష కానున్నది.
36 శాటిలైట్ల ప్రయోగం సందర్భంగా వన్‌వెబ్ కంపెనీ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. వన్‌వెబ్ చరిత్రలో ఇది ప్రతిష్టాత్మక మైలురాయి(Oneweb milestone)గా నిలుస్తుందని చెప్పారు. వన్‌వెబ్ శాటిలైట్లను ఇస్రో ప్రయోగించడం ఇది రెండవసారి అవుతుంది. ఇస్రోకు చెందిన కమర్షియల్ విభాగం ఎన్ఎస్ఐఎల్(NSIL) ఈ ప్రయోగాన్ని నిర్వహిస్తుంది. లాంచ్ వెహికిల్ మార్క్-3 (Launch Vehicle Mark-3)రాకెట్ ద్వారా .. లో ఎర్త్ ఆర్బిట్‌లోకి శాటిలైట్లను పంపనున్నారు.
వన్‌వెబ్ కంపెనీ ఇటీవల స్పేస్ఎక్స్ ఫాల్కన్-9(SpaceX Falcon9) రాకెట్ ద్వారా 40 ఇంటర్నెట్ శాటిలైట్లను ప్రయోగించిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

