ముంబైని భయపెడుతున్న మీజిల్స్..
Measles | దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మీజిల్స్ (తట్టు) కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మంగళవారం ఒక్కరోజే మహానగరంలో 20 మంది తట్టు (Measles ) బారినపడ్డారని బృహిన్‌ముంబై మున్సిపల్
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మీజిల్స్ (తట్టు) కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మంగళవారం ఒక్కరోజే మహానగరంలో 20 మంది తట్టు (Measles ) బారినపడ్డారని బృహిన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) తెలిపింది. ఈ వ్యాధి వల్ల ఏడాది వయస్సు ఉన్న చిన్నారి మరణించిందని వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు ఈ ఏడాదిలో పది మంది తట్టు వల్ల ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. జనవరి 1 నుంచి 220 కేసులు నమోదయ్యాయని పేర్కొన్నది.

ముంబైలో మీజిల్స్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు తొమ్మిది నెలల నుంచి ఐదేండ్ల వయస్సు ఉన్న తమ చిన్నారులకు వెంటనే టీకాలు వేయించాలని బీఎంసీ కోరింది. కాగా, మీజిల్స్ చికిత్స కోసం అంధేరిలోని సెవెన్‌హిల్స్ దవాఖానలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వెల్లడించింది.
ఇలా వ్యాప్తిచెందుతుంది..
దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్ల వల్ల ఒకరి నుంచి మరొకరికి మీజిల్స్ సోకుతుంది. ఒళ్లంత దద్దుర్లు, తీవ్రమైన జ్వరం దీని లక్షణాలు. విరేచనాలు, న్యుమోనియా కూడా కొందరిలో ఉంటుంది.. ఇవన్నీ కలిసి మరణానికి కారణమవుతాయి. రోగ నిరోధకత స్థాయి 95 శాతం కంటే తక్కువగా ఉన్న ఏ ప్రాంతంలోనైనా ఇది వ్యాపించే అవకాశం ఉంది. 1963లోనే తట్టుకు వ్యాక్సీన్ అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షా 40 వేల మంది ప్రాణాలను హరిస్తుండటం గమనార్హం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

