న్యూఢిల్లీ, మార్చి 6: సివిల్ ఉద్యోగులు నేషనల్ పెన్షన్ స్కీం(ఎన్పీఎస్) నుంచి పాత పెన్షన్ పథకం (ఓపీఎస్)లోకి మారేందుకు వన్‌టైమ్ ఆప్షన్‌ను కల్పిస్తున్నట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ ప్రకటించింది. కేంద్ర ఉద్యోగుల్లో కొందరు మాత్రమే ఈ ఆప్షన్‌కు అర్హులని పేర్కొన్నది. ఎన్పీఎస్పై నోటిఫై చేయడానికి ముందు (2003 డిసెంబర్ 22కు ముందు) నోటిఫై చేసిన పోస్టులు, ఖాళీల్లో నియమితులైనవారికి మాత్రమే ఈ ఆప్షన్ వర్తిస్తుందని వెల్లడించింది. అర్హులైనవారు ఆగస్టు 31లోగా ఈ ఆప్షన్‌ను వినియోగించుకోవచ్చని తెలిపింది.