Pulwama Encounter | పుల్వామాలో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా (Pulwama) జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇప్పటివరకు ఓ టెర్రరిస్టు (Terrorist) హతమయ్యాడు.
పుల్వామా: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా (Pulwama) జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇప్పటివరకు ఓ టెర్రరిస్టు (Terrorist) హతమయ్యాడు. పుల్వామా జిల్లాలోని అవంతిపొరాలోని (Awantipora) పడ్గంపొరాలో ఉగ్రవాదుల కోసం స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున భద్రతా బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రతిగా భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో (Pulwama Encounter) ఓ ముష్కరుడు చనిపోయాడని కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. మృతుడిని పుల్వామాకు చెందిన అఖిబ్ ముస్తాఖ్ భట్‌గా గుర్తించామన్నారు. హిజ్బ్ల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నాడని వెల్లడించారు. కశ్మీరీ పండిట్ సంజయ్ శర్మ హత్యలో అతడు కూడా పాలుపంచుకున్నాడని వెల్లడించారు.
J&K | An encounter broke out between terrorists and security forces in Awantipora. One terrorist was killed in the encounter.
(Visuals deferred by unspecified time) pic.twitter.com/PifDpmsPOV
— ANI (@ANI) February 28, 2023
పుల్వామాలో కశ్మీరీ పండిట్‌ను (Kashmiri Pandit) ఉగ్రవాదుల కాల్చి చంపిన తర్వాత ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకోవడం గమనార్హం. పుల్వామా జిల్లాలోని అచన్‌కు చెందిన సంజయ్ శర్మ అనే కశ్మీరీ పండిట్ ఆదివారం ఉదయం 11 గంటలకు ఇంటి నుంచి స్థానిక మార్కెట్‌కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కొందరు ఉగ్రవాదులు ఆయనను ఛాతిపై కాల్చడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దవాఖానకు తరలించేలోపే ప్రాణం పోయింది. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2020 నుంచి 9 మంది పండిట్లను ఉగ్రవాదులు కాల్చి చంపారని స్థానికులు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

