Naxal attack | ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ రెచ్చిపోతున్నారు. నారాయణపూర్ అమ్దై మైన్స్‌లో వద్ద ఐఈడీ పేలుడు జరిపారు. ఈ ఘటనలో ఓ జవాన్ వీరమరణం పొందగా.. మరో సైనికుడు గాయపడ్డారు. గనుల్లోని పలుచోట్ల ఐఈడీలను అమర్చుతామని నక్సల్స్ హెచ్చరించారు. గతంలో ఐఈడీ పేలుడులో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. నక్సల్స్ ఐఈడీ దాడిలో సైనికుడిని కమలేష్ సాహుగా గుర్తించారు. ఆయన స్వస్థలం జంజ్‌గిర్ చంపా జిల్లా హసౌద్ గ్రామం. నారాయణపూర్‌లోని ఛోటెడోంగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్‌డై గనిలో ఉదయం నక్సలైట్లు ఐఈడీని పేల్చడంతో పాటు కాల్పులు జరిపారని బస్తర్ ఐజీ సురందర్ రాజ్ తెలిపారు.
ఆ తర్వాత బలగాలు సైతం భద్రతా బలగాలు కాల్పులు జరిపాయని తెలిపారు. నక్సల్స్ దాడిలో సీఏఎఫ్ 9వ కార్ప్స్కు చెందిన కానిస్టేబుల్ కమలేష్ కుమార్ వీరమరణం పొందాడని తెలిపారు. కానిస్టేబుల్ వినయ్ కుమార్‌కు స్వల్పగాయాలయ్యాయని తెలిపారు. ఘటన తర్వాత పరిసర ప్రాంతాల్లో పోలీసు బలగాలు, డీఆర్జీ, ఐటీబీపీ బలగాలు తనిఖీలు నిర్వహించాయన్నారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 9న ఛోటాదొంగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ ఆలయంలో పూజలు చేసేందుకు వెళ్లిన బీజేపీ నేత కోమల్ మాఝీని నక్సల్స్ దాడి చేసి చంపేశారు. మరో వైపు నారాయణపూర్ గనుల వద్ద మోహరించిన 16 వాహనాలను నక్సల్స్ దగ్ధం చేశారు. పలువురు ఉద్యోగులను బందీలుగా పట్టుకున్నారు.