కుల్గాంలో ఉగ్రవాదుల గ్రనేడ్ దాడి.. పోలీసు అధికారి మృతి
Grenade attack | జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శనివారం రాత్రి కుల్గాం జిల్లాలోని ఖైమోహ్ ప్రాంతంలో ఓ పోలీసు అధికారిపై ముష్కరులు గ్రనేడ్ దాడి (Grenade attack) చేశారు.
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. శనివారం రాత్రి కుల్గాం జిల్లాలోని ఖైమోహ్ ప్రాంతంలో ఓ పోలీసు అధికారిపై ముష్కరులు గ్రనేడ్ దాడి (Grenade attack) చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయనను అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున మృతిచెందాడని అధికారులు తెలిపారు. ఆయనను పూంచ్‌కు చెందిన తాహిర్ ఖాన్‌గా గుర్తించారు.
కాగా, రాజౌరీ జిల్లాలోని ఆర్మీ క్యాంప్‌పై ముష్కరులు ఆత్మాహుతి దాడికి పాల్పడిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. శుక్రవారం ఉదయం రాజౌరీలోని ఆర్మీ బేస్ క్యాంపుపై ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. సుమారు నాలుగు గంటలపాటు జరిగిన హోరాహోరీ కాల్పుల్లో నలుగు సైనికులు అమరులవగా, ఇద్దరు టెర్రిరిస్టులను భద్రతా బలగాలు కాల్చి చంపాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

