Goa | పనాజీ : గోవాలో పర్యాటకుల బోటు ప్రమాదానికి గురైంది. నార్త్ గోవాలోని కంలంగుటే బీచ్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 20 మంది ప్రాణాలతో బయటపడ్డారు. వీరందరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు మినహా అందరూ లైఫ్ జాకెట్లు ధరించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ప్రాణ నష్టం పెద్దగా జరగలేదని చెప్పారు.
ఈ ప్రమాదం బుధవారం మధ్యాహ్నం 1:30 గంటలకు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. మృతి చెందిన వ్యక్తి వయసు 54 ఏండ్లు ఉంటుందని తెలిపారు. ప్రాణాలతో బయటపడిన వారిలో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరిలో 13 మంది ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. వీరంతా మహారాష్ట్రలోని ఖేద్ ప్రాంతానికి చెందినవారని చెప్పారు. తీరానికి 60 మీటర్ల దూరంలో బోటు మునిగిందని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Wife Dies | భార్య బాగోగుల కోసం వీఆర్ఎస్.. పదవీ విరమణ ఫంక్షన్లోనే ఆమె మృతి
Crime news | పార్లమెంట్ సమీపంలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. Video
Crime news | పెళ్లి చేసుకో.. పెళ్లి కొడుకును దోచుకో.. ఒంటరి పురుషులే ఈ కిలాడీ టార్గెట్స్..!