(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ప్రతీ నలుగురిలో ఒకరు ఇతర పార్టీ నుంచి వలస వచ్చినవారే. ఈ ఎన్నికల్లో బీజేపీ ఇప్పటివరకూ 435 మంది అభ్యర్థులను ప్రకటించగా.. అందులో 106 మంది (దాదాపు 25 శాతం) ఫిరాయింపుదారులే. ఈ మేరకు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఓ కథనంలో వెల్లడించింది.