గాంధీనగర్, మే 20 : లోక్సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థల ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించడం వల్ల దాదాపు రూ.7 లక్షల కోట్లు ఆదా అవుతాయని, పాలనా సామర్థ్యంమెరుగుపడడంతోపాటు దేశ జీడీపీ వృద్ధి 1.6 శాతం వరకు పెరుగుతుందని జమిలి ఎన్నికలపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) తెలిపింది.
గుజరాత్లోని గాంధీనగర్లో విలేకరుల సమావేశంలో జేపీసీ చైర్పర్సన్, లోక్సభ ఎంపీ పీపీ చౌదరి మాట్లాడుతూ ఏకకాల ఎన్నికల ప్రతిపాదనను అధ్యయనం చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో 8 మంది సభ్యుల కమిటీని ప్రధాని నరేంద్ర మోదీ నియమించారని తెలిపారు.