Video | మార్కెట్లో పేలిన హీలియం ట్యాంక్.. ఒకరుమృతి
హీలియం ట్యాంక్ పేలడంతో ఓ వ్యక్తి మరణించిన ఘటన తమిళనాడులోని తిరుచ్చిలో వెలుగుచూసింది. ఈ ఘటనలో రోడ్డు పక్కన బెలూన్లు కొంటున్న వ్యక్తి మరణించగా మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.
చెన్నై : హీలియం ట్యాంక్ పేలడంతో ఓ వ్యక్తి మరణించిన ఘటన తమిళనాడులోని తిరుచ్చిలో వెలుగుచూసింది. ఈ ఘటనలో రోడ్డు పక్కన బెలూన్లు కొంటున్న వ్యక్తి మరణించగా మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. నగరంలోని రద్దీ ప్రాంతంలో ఘటన జరగడంతో అక్కడున్న వారు భయంతో పరుగులు తీయడం సీసీటీవీ ఫుటేజ్లో కనిపించింది.
#WATCH | Tamil Nadu: A helium tank exploded in a market in Trichy's Kotai Vasal area yesterday; One dead & several injured. Case registered. pic.twitter.com/wUHvlaM5GQ
— ANI (@ANI) October 3, 2022
మృతుడిని 35 ఏండ్ల రవిగా గుర్తించారు. నిర్లక్ష్యంతో వ్యక్తి మరణానికి కారణమయ్యాడనే అభియోగంపై బెలూన్ల విక్రేతను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుచ్చిలోని ఫోర్ట్ ప్రాంతంలో టెక్స్టైల్ షోరూంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో పేలుడు ఘటన రికార్డైంది. టెక్స్టైల్ షోరూం వెలుపలనే విక్రేత బెలూన్లను అమ్ముతున్నాడు. పేలుడు ఘటనతో ప్రజలు తలో దిక్కు పరుగెడుతున్న దృశ్యాలు కనిపించాయి. పేలుడు ఘటనలో ఓ ఆటోతో పాటు పలు బైక్లు దగ్ధమయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Explodes
- Helium
- Tamil Nadu
- tank
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

