Jagannath Rath Yatra | పూరీ జగన్నాథ రథయాత్రలో అపశృతి.. ఒకరి మృతి.. 100 మందికి గాయాలు..!
Jagannath Rath Yatra | ఒడిశా (Odisha) లోని పూరీ (Puri) లో గురువారం జరిగిన జగన్నాథ రథయాత్ర (Jagannath Rath Yatra) లో అపశ్రుతి చోటుచేసుకుంది. భారీగా తరలివచ్చిన భక్తుల రద్దీ కారణంగా ఏర్పడిన తొక్కిసలాటలో ఊపిరాడక ఒకరు మరణించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం పూరీలోని మారిచికుండ్ (Marichkund) కూడలి వద్ద ఈ దుర్ఘటన జరిగింది.
Jagannath Rath Yatra : ఒడిశా (Odisha) లోని పూరీ (Puri) లో గురువారం జరిగిన జగన్నాథ రథయాత్ర (Jagannath Rath Yatra) లో అపశ్రుతి చోటుచేసుకుంది. భారీగా తరలివచ్చిన భక్తుల రద్దీ కారణంగా ఏర్పడిన తొక్కిసలాటలో ఊపిరాడక ఒకరు మరణించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం పూరీలోని మారిచికుండ్ (Marichkund) కూడలి వద్ద ఈ దుర్ఘటన జరిగింది. భక్తులను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన తాళ్ల బారికేడ్ కూలిపోవడం, కొందరు భక్తులు పట్టుతప్పి కింద పడిపోవడంతో ఒకరిపై ఒకరు పడిపోయారు.
సుమారు 100 మంది ఒకేచోట పడిపోవడంతో పలువురు గాయపడ్డారు. వారిలో నలుగురైదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వెంటనే స్పందించి సుమారు 20 మందిని రక్షించి అంబులెన్స్‌లలో ఆసుపత్రికి తరలించామని, చికిత్స పొందుతూ ఒక వృద్ధుడు మరణించినట్లు తెలిసిందని వారు పేర్కొన్నారు. భారీ జనసందోహం, కుండపోత వర్షం కారణంగా ఊపిరాడక, ఇతర గాయాలతో సుమారు 200 మంది భక్తులు పూరీలోని ఆసుపత్రులలో, తాత్కాలిక వైద్య శిబిరాల్లో చేరినట్లు సమాచారం.
లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. అంతకుముందు గురువారం ఉదయం షెడ్యూల్ కంటే ముందుగానే పహండీ బిజే క్రతువుతో రథయాత్ర ప్రారంభమైంది. అయితే ఊరేగింపు పూర్తికావడానికి మాత్రం రెండు గంటలకుపైగా ఆలస్యమైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

