న్యూఢిల్లీ: నకిలీ బాంబు బెదిరింపులను అడ్డుకునేందుకు కేంద్రం..విమానయాన భద్రతా నియమాలను సవరించింది. భారత్లో ఇకపై ఎవరైనా నకిలీ బాంబు బెదిరింపులతో విమాన రాకపోకల్ని ప్రభావితం చేస్తే..దోషులకు కోటి రూపాయల వరకు జరిమానా విధించనున్నారు. ఈమేరకు సవరించిన విమానయాన భద్రతా నిబంధనలను నోటిఫై చేస్తూ కేంద్రం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.
భారత్లో ఇటీవల కొన్ని వందలాది విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు వెలువడ్డాయి. దీంతో ప్రయాణికులు, విమాన సిబ్బంది..ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దారిమళ్లింపు, సెక్యూరిటీ ప్రొటోకాల్ వంటి చర్యల వల్ల విమానయాన సంస్థలపై పెద్ద మొత్తంలో ఆర్థికభారం పడింది.