గౌహతి: ముస్లిం శాసనసభ్యులకు ప్రతి శుక్రవారం నమాజ్ కోసం రెండు గంటలు విరామం ఇచ్చే దశాబ్దాల నాటి నిబంధనను రద్దు చేయాలని అస్సాం అసెంబ్లీ నిర్ణయించింది. (No Namaz Break In Assam Assembly) ఇతర రోజుల మాదిరిగానే శుక్రవారం కూడా సభా కార్యకలాపాలను కొనసాగించాలని అసెంబ్లీ రూల్స్ కమిటీ శుక్రవారం తీర్మానం చేసింది. అయితే దీనిపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. ముస్లిం ఎమ్మెల్యేలు ప్రార్థనలకు హాజరయ్యేందుకు వీలుగా ఇప్పటి వరకు ప్రతి శుక్రవారం అస్సాం అసెంబ్లీ రెండు గంటలు వాయిదా పడేది. శుక్రవారం ఉదయం 11 గంటలకు సభను వాయిదా వేసేవారు. ముస్లిం సభ్యుల నమాజ్ అనంతరం లంచ్ సెషన్ తర్వాత అసెంబ్లీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యేవి.
కాగా, మతపరమైన ప్రయోజనాల కోసం ఎలాంటి వాయిదా లేకుండా ఇతర రోజుల మాదిరిగానే శుక్రవారం రోజు కూడా సభా కార్యకలాపాలు కొనసాగడంపై స్పీకర్ బిస్వజిత్ డైమరీ దృష్టి సారించినట్లు అస్సాం అసెంబ్లీ కార్యాలయం పేర్కొంది. రాజ్యాంగంలోని లౌకిక స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని శుక్రవారాల్లో ఏ విధమైన వాయిదా లేకుండా అస్సాం అసెంబ్లీ కార్యకలాపాలను నిర్వహించాలని స్పీకర్ ప్రతిపాదించినట్లు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ ఈ నిర్ణయంపై స్పందించారు. ముస్లిం ఎమ్మెల్యేల నమాజ్ కోసం రెండు గంటల విరామాన్ని తొలగించడం ద్వారా అస్సాం అసెంబ్లీ ఉత్పాదకతకు ప్రాధాన్యత లభిస్తుందని తెలిపారు. అలాగే వలస పాలనకు సంబంధించిన మరో చిహ్నం తొలగిందని అన్నారు. 1937లో ముస్లిం లీగ్‌కు చెందిన సయ్యద్ సాదుల్లా ఈ పద్ధతిని ప్రవేశపెట్టినట్లు ఎక్స్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
By doing away with the 2 hour Jumma break, @AssamAssembly has prioritised productivity and shed another vestige of colonial baggage.
This practice was introduced by Muslim League’s Syed Saadulla in 1937.
My gratitude to Hon’ble Speaker Shri @BiswajitDaimar5 dangoriya and our…
— Himanta Biswa Sarma (@himantabiswa) August 30, 2024