Rajasthan | జైపూర్, అక్టోబర్ 25: భూ వివాదంలో సొంత సోదరుడినే ట్రాక్టర్‌తో తొక్కి హతమార్చిన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకున్నది. భరత్పూర్ జిల్లాలో ఇద్దరు సోదరుల మధ్య కొద్ది రోజులుగా భూ వివాదం నడుస్తున్నది. దీంతో సోదరుడని కూడా చూడకుండా ట్రాక్టర్ని పలుసార్లు మీద ఎక్కించి హతమార్చాడు తోబుట్టువు. అయితే అక్కడున్నవాళ్లు సర్దిచెప్పకుండా ఘటనను సెల్ఫోన్లలో చిత్రీకరించడంలో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.