బెంగళూరు: ఒక వ్యక్తి నగ్నంగా మొబైల్ షాపులోకి చొరబడ్డాడు. ముఖానికి మాస్క్ ధరించిన అతడు రూ.25 లక్షలకుపైగా విలువైన మొబైల్ ఫోన్స్ చోరీ చేశాడు. ఆ షాపులోని సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. (Man Breaks Into Mobile Shop) దర్యాప్తు చేసిన పోలీసులు ఆ దొంగను అరెస్ట్ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. మే 9న తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో బొమ్మనహళ్లి ప్రాంతంలోని మొబైల్ షాపులోకి ఒక దొంగ ప్రవేశించాడు. ఒంటిపై ఎలాంటి దుస్తులు లేకుండా నగ్నంగా ఉన్నాడు. ముఖానికి మాస్క్ ధరించాడు. చేతిలోని టార్చ్‌లైట్ వెలుతురులో ఆ షాపులో చోరీకి పాల్పడ్డాడు. సుమారు రూ.25 లక్షలకుపైగా విలువైన ఖరీదైన మొబైల్స్ ఫోన్స్ దొంగిలించి అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, మొబైల్ షాపులో చోరీ జరిగినట్లు తెలిసి షాపు యజమాని దినేష్ షాక్ అయ్యాడు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించాడు. పూర్తి నగ్నంగా ఉన్న వ్యక్తి ఈ చోరీకి పాల్పడినట్లు గమనించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేసిన పోలీసులు చివరకు ఆ దొంగను అరెస్ట్ చేశారు. అయితే అతడు నగ్నంగా ఎందుకు చోరీకి పాల్పడ్డాడో అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు.
మరోవైపు తన డ్రెస్ వల్ల గుర్తించకుండా ఉండేందుకే అతడు నగ్నంగా మొబైల్ షాప్‌లోకి చొరబడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ప్రియురాలికి ఖరీదైన బహుమతుల కోసం నిందితుడు ఈ చోరీకి పాల్పడినట్లు పోలీస్ అధికారి తెలిపారు. మొబైల్ ఫోన్లను అతడి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. కాగా, సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#TheSouthernView with @tmvraghav: If you think you’ve seen it all, think again! A naked thief steals mobile phones in Bengaluru. pic.twitter.com/6gbvcXThFT
— NDTV (@ndtv) May 15, 2025