లక్నో: ఒక పోలీస్ అధికారిని అతడి కుటుంబం ఎదుటే కొందరు వ్యక్తులు కొట్టారు. (Cop Thrashed By Mob) తొలుత ప్రతిఘటించేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే ఎక్కువ మంది దాడి చేయడంతో తనను కొట్టవద్దని వేడుకున్నారు. చివరకు అక్కడకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఈ సంఘటన జరిగింది. రాజతలాబ్ పోలీస్ స్టేషన్ హెడ్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌వో) అజిత్ వర్మ శనివారం సాయంత్రం తన భార్య, పిల్లలతో కలిసి కారులో ప్రయాణించాడు. కారు డ్రైవ్ చేసిన ఆయన ఒక ఆటోను ఢీకొట్టాడు. దీంతో సివిల్ డ్రెస్‌లో ఉన్న ఆ పోలీస్‌పై అక్కడున్న కొందరు వ్యక్తులు దాడి చేశారు. పిడిగుద్దులు కురిపించారు.
కాగా, తాను పోలీస్ అధికారినని, కొట్టవద్దని అజిత్ వర్మ చెప్పినప్పటికీ వారు పట్టించుకోలేదు. అక్కడున్న పోలీస్ కానిస్టేబుల్ జోక్యం చేసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు సమీప పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసులు అక్కడకు చేరుకున్నారు. జనానికి నచ్చజెప్పి అతడ్ని విడిపించారు.
మరోవైపు ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకున్నారు. కాగా, ఆ పోలీస్‌పై దాడి ఘటనను కొందరు వ్యక్తులు మొబైల్లో రికార్డ్ చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
सिविल ड्रेस में SHO साहब की भीड़ ने कर दी पिटाई!
बताया जा रहा राजातालाब थानाध्यक्ष परिवार संग कार से #वाराणसी के रोहनियां गए थे….कार ऑटो से टकरा गई और भीड़ ने उन्हें खींचकर पीट दिया!!
सोशल मीडिया पर #VideoViral pic.twitter.com/GVXBpoXM0V
— Himanshu Tripathi (@himansulive) November 23, 2024