పాట్నా : ఓ ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు రూ. 500 కోసం చెప్పులతో కొట్టుకున్నారు. ఈ ఘటన బీహార్ జాముయి జిల్లాలోని లక్ష్మిపూర్ బ్లాక్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఆదివారం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. నవజాత శిశువుకు బీసీజీ వ్యాక్సిన్ ఇప్పించేందుకు ఆశా వర్కర్ రింటూ కుమారి లక్ష్మిపూర్ బ్లాక్ ప్రైమరీ హెల్త్ సెంటర్కు ఆదివారం తీసుకెళ్లింది. హెల్త్ సెంటర్ ఏఎన్ఎం రంజన కుమారి విధుల్లో ఉంది. బీసీజీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే రూ. 500 లంచం డిమాండ్ చేసింది.
ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరికొకరు చెప్పులతో కొట్టుకున్నారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఇద్దరిని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలు వినిపించుకోకుండా జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ ఘటనపై సీనియర్ అధికారులు తీవ్రంగా స్పందించారు. పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.
On Camera Two Health Workers Fight Over ₹500 In Bihar#BiharNews #Bihar #ViralVideo #fight pic.twitter.com/pYfgFfy7lb
— Sheikh Sabir (@sheikhsabirr) January 24, 2022