భారత్‌లో ఒమిక్రాన్ కేసులు కలకలం రేపుతున్నాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికుల్లో ఈ వేరియంట్ కనిపించింది. ఒమిక్రాన్ వేరియంట్ భయంతో ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరికీ కరోనా టెస్టులు చేయిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే ఇలా ఆఫ్రికా దేశాల నుంచి బెంగళూరుకు వచ్చిన పది మంది ఎక్కడుందీ తెలియడం లేదని కర్ణాటక రెవెన్యూ మంత్రి ఆర్ అశోక తెలిపారు. ఈ పదిమంది కూడా ఎయిర్‌పోర్టులో ఇచ్చిన అడ్రస్‌లలో లేరని, మొబైల్స్ కూడా స్విచాఫ్ వస్తున్నాయని ఆయన వెల్లడించారు.
వారిని ఎలాగైనా గుర్తించి కరోనా టెస్టులు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ విషయంలో బెంగళూరు సిటీ కమిషనర్ స్వయంగా రంగంలోకి దిగి ఈ సమస్యను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు.
We will trace &track & test them ('missing' passengers from South Africa) today: K'taka Revenue Minister R Ashoka pic.twitter.com/R8507vJNeo
— ANI (@ANI) December 3, 2021