Omar Abdullah | శ్రీనగర్: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై నేషనల్ కాన్ఫరెన్స్ శాసనసభాపక్ష నేత ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు లేకపోయినప్పటికీ ఎన్నికల్లో తాము గెలిచేవాళ్లమని అన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ… కేంద్రంతోనూ సామరస్యంగా వెళ్లాలనుకుంటున్నట్టు ఆయన చెప్పారు.
కేంద్రంతో తమకు సమన్వయం అవసరమని, కేంద్రంతో కొట్లాట ద్వారా జమ్ము కశ్మీర్‌కు సంబంధించిన సమస్యలు పరిష్కారం కావని ఆయన పేర్కొన్నారు. మోదీని తాను గౌరవిస్తానని, జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తామని ఆయన హామీ ఇచ్చారని పేర్కొన్నారు.