Om Birla | లోక్‌సభ స్పీకర్‌గా మరోసారి ఓంబిర్లాకే ఛాన్స్.. మరికాసేపట్లో నామినేషన్
Om Birla | లోక్‌సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది. మోదీ 2.0 ప్రభుత్వ హయాంలో స్పీకర్‌గా వ్యవహరించిన బీజేపీ ఎంపీ ఓం బిర్లా (Om Birla)కే మరోసారి అవకాశం దక్కింది.
Om Birla | లోక్‌సభ స్పీకర్ (Lok Sabha Speaker) ఎన్నికపై ఉత్కంఠకు తెరపడింది. మోదీ 2.0 ప్రభుత్వ హయాంలో స్పీకర్‌గా వ్యవహరించిన బీజేపీ ఎంపీ ఓం బిర్లా (Om Birla)కే మరోసారి అవకాశం దక్కింది. ఎన్డీయే, విపక్ష కూటమి సభ్యులు స్పీకర్ ఎన్నికపై ఏకాభిప్రాయానికి వచ్చారు. లోక్‌సభ స్పీకర్ పదవికి తమ అభ్యర్థిని నిలబెట్టకూడదని విపక్షాలు నిర్ణయించాయి. దీంతో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా లోక్‌సభ స్పీకర్ పదవికి ఓంబిర్లా మరికాసేపట్లో నామినేషన్ వేయనున్నారు.
స్పీకర్ ఎన్నికపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh), పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజుజు ఇవాళ ఉదయం ఇండియా కూటమి ఎంపీలతో సమావేశమై చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ప్రతిపక్ష నేతలు డిప్యూటీ స్పీకర్ పదవిని ఆశించినట్లు తెలిసింది. డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇస్తే.. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. దీంతో డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేందుకు ఎన్డీయే కూటమి దాదాపు అంగీకరించింది.
దీంతో లోక్‌సభ స్పీకర్ పదవికి ఓం బిర్లా పేరును ఎన్డీయే కూటమి ఖరారు చేసింది. అనంతరం పార్లమెంట్ హౌస్‌లోని ప్రధాని మోదీతో అమిత్ షా, జేపీ నడ్డా, ఓం బిర్లా సమావేశమయ్యారు. మరికాసేపట్లో లోక్‌సభ స్పీకర్ పదవికి ఓంబిర్లా నామినేషన్ వేయనున్నారు. ఎన్డీయే కూటమి నేతలతో కలిసి లోక్‌సభ సెక్రటేరియట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Also Read..
Karnataka | కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. చికెన్ కబాబ్‌లో కృత్రిమ రంగు వాడకంపై నిషేధం
Nita Ambani | పదేళ్ల తర్వాత కాశీకి వెళ్లిన నీతా అంబానీ.. రోడ్‌సైడ్ షాప్‌లో చాట్ తిని
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

