Karnataka | కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. చికెన్ కబాబ్‌లో కృత్రిమ రంగు వాడకంపై నిషేధం
Karnataka | కర్ణాటక (Karnataka) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాకాహారంతోపాటు చికెన్ (Chicken), ఫిష్ కబాబ్స్ (Fish Kebabs) తయారీల్లో కృత్రిమ రంగుల (Artificial Colours) వాడకాన్ని పూర్తిగా నిషేధించింది.
Karnataka | కర్ణాటక (Karnataka) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాకాహారంతోపాటు చికెన్ (Chicken), ఫిష్ కబాబ్స్ (Fish Kebabs) తయారీల్లో కృత్రిమ రంగుల (Artificial Colours) వాడకాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కృత్రిమ రంగుల వాడకం వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంది. ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు తెలిపారు.
కృత్రిమ రంగులు శరీరానికి హానికరమని, ఇవి ఆరోగ్యానికి ప్రతికూల ప్రభావాలను కలిగిస్తాయని ఆయన అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నిషేధం విధించినట్లు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఏడేళ్లు జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానాతో సహా తీవ్రమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మంచూరియా, కాటన్ క్యాండీపై కర్ణాటకలో నిషేధం
కాగా, గోబీ మంచూరియా, కాటన్ క్యాండీ (పీచు మిఠాయి) విక్రయాలపై కూడా కర్ణాటక సర్కార్ ఇటీవలే నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఆకర్షణీయంగా కనిపించడానికి ఈ పదార్థాల్లో కృత్రిమ ఫుడ్ కలర్స్‌ను వాడుతుండటమే కారణంగా తెలిపింది. రంగుల కోసం ఉపయోగించే రోడమైన్-బి అనే రసాయనం క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాలకు కారణమవుతున్నదని, అలాంటి విష పదార్థాన్ని గోబీ మంచూరియా, కాటన్ క్యాండీల్లో యథేచ్ఛగా వినియోగిస్తున్నారని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండురావు ఈ ఏడాది మార్చిలో నిర్వహించిన మీడియా భేటీలో వెల్లడించారు.
‘ఆరోగ్యశాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల పలు ఫుడ్ సెంటర్లు, 3-స్టార్ హోటల్స్ నుంచి 171 గోబీ మంచూరియా, 25 కాటన్ క్యాండీ నమూనాలను సేకరించారు. వాటిని పరీక్షించగా.. 106 మంచూరియా పదార్థాల్లో, 15 క్యాండీల్లో హానికర కృత్రిమ రంగులను ఉపయోగించినట్లు తేలింది. వాటిల్లో రోడమైన్-బి, టాట్రజైన్, కార్మోయిజిన్, సన్‌సెట్ యెల్లో వంటి రసాయనాలను వినియోగిస్తున్నారు. ఇవి ఆరోగ్యానికి హానికరం’ అని పేర్కొన్నారు. రంగులు వినియోగించిన గోబీ మంచూరియా, కాటన్ క్యాండీలను నిబంధనలు ఉల్లంఘిస్తూ విక్రయాలు చేపట్టే వారికి ఏడేండ్ల జైలు శిక్షతో పాటు రూ. 10 లక్షల జరిమానా, లైసెన్సును రద్దు చేస్తామని మంత్రి తెలిపారు.
Also Read..
Nita Ambani | పదేళ్ల తర్వాత కాశీకి వెళ్లిన నీతా అంబానీ.. రోడ్‌సైడ్ షాప్‌లో చాట్ తిని
Leopard | శంషాబాద్‌లో చిరుతపులి కలకలం.. పట్టుకునేందుకు బోన్లతోపాటు ట్రాప్ కెమెరాలు
Emergency | టుడే స్పెషల్.. కంగనారనౌత్ ఎమర్జెన్సీ కొత్త విడుదల తేదీ ఇదే
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagan helicopter | వైఎస్ జగన్‌పై చంద్రబాబు సర్కార్ కుట్రలు? జగన్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్.. బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారా?
Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
Raptadu incident | వరుసకు బాబాయ్..! పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి, రాప్తాడు ఘటనలో కీలక విషయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

