Om Birla : నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ కూటమికి రానున్న లోక్సభ ఎన్నికల్లో 400కిపైగా స్దానాలు లభిస్తాయని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ధీమా వ్యక్తం చేశారు. కోటా ప్రజల ప్రేమ, ఆశీస్సులతోనే తాను ఈ స్ధితికి చేరుకున్నానని అన్నారు. నామినేషన్ దాఖలు కార్యక్రమానికి తన కోసం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు.
కోటా నియోజకవర్గం నుంచి లోక్సభ స్పీకర్, బీజేపీ అభ్యర్ధి ఓం బిర్లా బుధవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. అంతకుముందు ఆయన విలేకరులతో మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మోదీ నాయకత్వంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
లోక్సభ స్పీకర్గా ఉన్నా తాను ఈ ఐదేండ్లు కోటా ప్రజల మధ్య ఉండేందుకు ప్రయత్నించానని తెలిపారు. మౌలిక వసతుల పరంగా, సామాజిక సంక్షేమమైనా ప్రధాని మోదీ అన్ని రంగాల్లో సమూల మార్పులు తీసుకురావడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. కోటా ప్రజలు ఈసారి కూడా తనను దీవిస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.
Read More :
Sushil Modi | గత 6 నెలలుగా క్యాన్సర్తో పోరాడుతున్నాను.. సుశీల్ మోదీ సంచలన ప్రకటన