పాట్నా, జనవరి 31: శ్మశాన వాటికకు వెళ్లేందుకు దారి ఇవ్వడానికి నిరాకరించడంతో ఓ 91 ఏండ్ల మహా దళిత వృద్ధురాలికి రోడ్డు మధ్యలోనే అంత్యక్రియలు జరిగాయి. ఈ అమానవీయ ఘటన బీహార్లోని వైశాలి జిల్లా సొంధో వాసుదేవ్ గ్రామంలో చోటుచేసుకుంది.
ఆ గ్రామంలో నివసించే దహోర్ మాంఝి భార్య ఝాన్సీ దేవి మరణించగా, మృతదేహాన్ని అంత్యక్రియల కోసం శ్మశాన వాటికకు తీసుకువెళుతుండగా రోడ్డును ఆక్రమించుకున్న స్థానిక గ్రామస్తులు, దుకాణదారులు, రైతులు శవయాత్రను అడ్డుకున్నారు. దీంతో శివాలయం ఎదుట రోడ్డు మధ్యలోనే వృద్ధురాలికి చితిపేర్చి దహనక్రియలు నిర్వహించారు.