న్యూఢిల్లీ, మార్చి 30: బెంగళూరు నుంచి గువహటి వెళ్తున్న కామాఖ్య ఏసీ సూపర్‌ఫాస్ట్ రైలు ఆదివారం ప్రమాదానికి గురైంది. ఒడిశాలో కటక్-నెర్గుండి స్టేషన్ల మధ్య ఈ రైలు పట్టాలు తప్పింది. మొత్తం 11 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందారు. రైలు వేగం తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పినట్టు తెలుస్తున్నది. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులకు గాయాలైనట్టు రైల్వే డీఎం దత్తాత్రేయ షిండే వెల్లడించారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నదని చెప్పారు.