భువనేశ్వర్: ఒడిశా ఎమ్మెల్యేల జీతభత్యాలను మూడు రెట్లు పెంచుకుంటూ బీజేపీ ప్రభుత్వం ఇటీవల ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోవడంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునః పరిశీలించాలని అధికార బీజేపీ ఎమ్మెల్యేలు సీఎం మాంఝీకి గురువారం విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ సహా ఎమ్మెల్యేలందరి జీతాలు, భత్యాలు మూడు రెట్లు పెంచుతూ ఈ నెల 9న శానససభలో ఏకగ్రీవంగా ఆమోదించుకున్నారు. దీంతో ఎమ్మెల్యేల జీతం రూ. 1.11 లక్షల నుంచి 3.45 లక్షలకు పెరగనుంది. ప్రజల సంక్షేమాన్ని మరచి మూడు రెట్లు జీతాలు పెంచుకోవడంపై ప్రజాగ్రహం వ్యక్తమైంది.