Odisha | పెళ్లి చేసుకోవాలి అని ఒత్తిడి.. ప్రియురాలిని బ్రిడ్జిపైనుంచి తోసేసి చంపిన ప్రియుడు
Odisha : పెళ్లి చేసుకోవాలని ప్రేయసి ఒత్తిడి తెచ్చినందుకు ఆమెను హత్య చేశాడు ప్రియుడు. ఈ ఘటన ఒడిశాలోని గంజాం జిల్లాలో ఈ నెల 7న జరిగింది. హంతకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా రోహి గ్రామానికి చెందిన అంబిక అనే యువతి ఇంటర్ పూర్తి చేసుకుంది.
Odisha : పెళ్లి చేసుకోవాలని ప్రేయసి ఒత్తిడి తెచ్చినందుకు ఆమెను హత్య చేశాడు ప్రియుడు. ఈ ఘటన ఒడిశాలోని గంజాం జిల్లాలో ఈ నెల 7న జరిగింది. హంతకుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా రోహి గ్రామానికి చెందిన అంబిక అనే యువతి ఇంటర్ పూర్తి చేసుకుంది. డాక్టర్ అవ్వాలనే కోరికతో నీట్ ప్రిపేర్ కావాలని నిశ్చయించుకుంది. ఇదే సమయంలో అంబిక చాలాకాలంగా నిమాఖండి పెంత్ ప్రాంతానికి చెందిన రాకేష్ ఆచార్య అనే వ్యక్తితో ప్రేమలో ఉంది.
ఇద్దరూ చాలా సన్నిహితంగా ఉండేవారు. దీంతో తనను పెళ్లి చేసుకోవాలని అంబిక.. రాజేష్‌ను కోరింది. చాలాసార్లు ఈ అంశంపై ఇద్దరిమధ్యా వాగ్వాదం జరిగింది. అయితే, ఆమెను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని రాకేష్ ఆచార్య.. అంబికను అంతం చేయడం ఒక్కటే దీనికి పరిష్కారం అని భావించాడు. దీంతో ఆమెను చంపేందుకు ఒక ప్లాన్ వేశాడు. ఈ ప్లాన్ ప్రకారం ఈ నెల 7న అంబికను తనతోపాటు సరదాగా గడపడానికి బైకుపై గోపాల్పూర్ తీసుకెళ్లాడు. అక్కడ రోజంతా గడిపిన తర్వాత రాత్రిపూట తిరిగి ఇంటికి బయల్దేరారు. అలా వస్తుండగా, అంకులి అనే బ్రిడ్జి వద్ద బైకు ఆపాడు. తర్వాత ఎవరూ చూడట్లేదని నిర్ధరించుకుని అంబికను బ్రిడ్జి మీద నుంచి కిందకు తోసేశాడు. దీంతో అంబిక అక్కడికక్కడే మరణించింది. అనంతరం ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించింది అనేలా నమ్మించాడు.
ముందుగా రోడ్డు ప్రమాదం అని చెప్పాడు. దీంతో పోలీసులు ఇదే దిశలో కేసు నమోదు చేసుకున్నారు. కానీ, అతడు చెప్పే సమాధానాల్లో సరైన పోలికలు లేకపోవడంతో అంబిక కుటుంబ సభ్యులు అతడిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు రాకేష్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం బయటపడింది. తానే అంబికను హత్య చేసినట్లుగా అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేశాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Ganjam
- girlfriend
- Gopalpur
- Odisha
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

