నబ్రంగ్పూర్ (ఒడిశా): ఒడిశాలోని సొరడా గ్రామవాసి సాములు పంగి (35) గురువారం భార్య శవాన్ని మోసుకొని కొన్ని కిలో మీటర్లు నడి చారు. తన భార్య ఇద్గురు (30)కు అస్వస్థతగా ఉండటంతో విశాఖపట్నం జిల్లా సంగవలస దవాఖానలో చూపించగా ఆమె చికిత్సకు స్పందించడం లేదని డాక్టర్లు తెలిపారు. దాంతో పంగి ఆటోలో ఇంటికి బయలుదేరాడు. దారి మధ్యలో ఇద్గురు మరణించింది. మృతదేహాన్ని తీసుకెళ్లడానికి నిరాకరించిన డ్రైవర్ చెల్లూరు రింగ్ రోడ్ వద్ద దించేసి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఊరికి భార్య మృతదేహాన్ని తీసుకెళ్లే మార్గం కానరాక భుజాన వేసుకుని నడక ప్రారంభించాడు పంగి. విషయం పోలీసులకు తెలియడంతో అంబులెన్స్‌లో అతడిని స్వగ్రామానికి పంపారు.