Scrub Typhus | ఒడిశాలో స్క్రబ్ టైఫస్ కలకలం.. ఐదుగురు మృతి.. అప్రమత్తమైన సర్కారు
Scrub Typhus | ఒడిశాలో ప్రాణాంతక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్క్రబ్ టైఫస్ (Scrub Typhus), లెప్టోస్పైరోసిస్ (Leptospirosis) వ్యాధులు కలకలం రేపుతున్నాయి. బార్గఢ్ జిల్లాలో స్క్రబ్ టైఫస్ బారినపడి ఐదుగురు మరణించారు. దాంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
భువనేశ్వర్: ఒడిశాలో ప్రాణాంతక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్క్రబ్ టైఫస్ (Scrub Typhus), లెప్టోస్పైరోసిస్ (Leptospirosis) వ్యాధులు కలకలం రేపుతున్నాయి. బార్గఢ్ జిల్లాలో స్క్రబ్ టైఫస్ బారినపడి ఐదుగురు మరణించారు. దాంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. స్క్రబ్ టైఫస్ మరింత విస్తరించకుండా తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల ఆరోగ్య విభాగం అధికారులకు ఒడిశా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాలు జారీచేసింది.
అన్ని జిల్లాల చీఫ్ మెడికల్ అధికారులకు, ప్రజారోగ్య అధికారులకు, భువనేశ్వర్‌లోని క్యాపిటల్ హాస్పిటల్ డైరెక్టర్‌కు, రూర్కెలా RGH డైరెక్టర్‌కు ఆరోగ్య శాఖ స్క్రబ్ టైఫస్ నిర్మూలనకు అవసరమైన సూచనలు చేసింది. వ్యాధిని త్వరగా గుర్తించి తక్షణమే చికిత్స అందించేలా అనుక్షణం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించింది. అన్ని జిల్లాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉండేలా చూడాలని, అందుకు కావాల్సినన్ని టెస్ట్ కిట్స్‌ను సరఫరా చేయాలని ఆదేశాల్లో పేర్కొన్నది.
ప్రజల్లో కూడా స్క్రబ్ టైఫస్ విస్తృతిపై అవగాహన కల్పించాలని అన్ని జిల్లాల ఆరోగ్య అధికారులకు ఒడిశా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సూచించింది. స్క్రబ్ టైఫస్ మరణాలపై సమగ్ర విచారణ చేస్తూ దాని నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. కాగా, ఈ స్క్రబ్ టైఫస్‌నే బుష్ టైఫస్ (BUSH typhus) అని కూడా అంటారు. ఓరియెంటా సుసుగాముషి (Orienta tsutsugamushi) అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ఈ బ్యాక్టీరియా సోకిన కీటకాలు కుట్టడం ద్వారా జనాల్లో ఈ వ్యాధి విస్తరిస్తుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

