భువనేశ్వర్: ఒడిశా గవర్నర్ రఘుబర్‌దాస్ కుమారుడు లలిత్దాస్ తనపై దాడిచేశారని రాజ్‌భవన్‌లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి బైకుంఠనాథ్ ప్రధాన్ ఆరోపించారు. గతవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పూరీ సందర్శించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని ఆయన తెలిపారు.
గవర్నర్ సెక్రటరీ సస్వత్ మిశ్రాకు ఆయన ఫిర్యాదు చేస్తూ.. జూలై 7న రాత్రి 11.45 గంటల సమయంలో లలిత్ కోపంతో ఊగిపోతూ అసభ్యంగా తిడుతూ చెంపలు వాయించారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని బయటపెడితే చంపేస్తానని లలిత్‌కుమార్ హెచ్చరించారని ఆరోపించారు. అయితే, ఇదంతా కుట్ర అని గవర్నర్ సహాయకుడు ఒకరు కొట్టిపడేశారు.