భువనేశ్వర్, నవంబర్ 12: భారత్‌కు చెందిన తృష్ణా రే ‘మిస్ టీన్ యూనివర్స్-2024’ కిరీటాన్ని దక్కించుకున్నారు. ఒడిశాలోని భువనేశ్వర్ కేఐఐటీ యూనివర్సిటీ విద్యార్థిని అయిన తృష్ణా రే దక్షిణాఫ్రికాలోని కింబెర్లీలో నవంబర్ 1 నుంచి 10 వరకు జరిగిన పోటీలలో విజేతగా నిలిచారు. పెరూ, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, కెన్యా, పోర్చుగల్, నెదర్లాండ్స్‌కు చెందిన యువతులు ఫైనల్స్‌కు చేరుకోగా, రే వారిని ఓడించి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.
పెరూకు చెందిన అన్నే థ్రోసన్, నమీబియాకు చెందిన ప్రెసియస్ ఆండ్రేలు మొదటి, రెండో రన్నరప్‌లుగా నిలిచారు. గత ఏడాది ఏప్రిల్‌లో మిస్ టీన్ యూనివర్స్ ఇండియా విజేతగా నిలిచిన 19 ఏండ్ల రే.. కేఐఐటీ యూనివర్సిటీలో ఫ్యాషన్ టెక్నాలజీ చదువుతున్నది. ఆమె తండ్రి దిలీప్ కుమార్ రే కర్నల్‌గా ఉన్నారు.