బెంగళూరు: జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల వీడియోలన్నీ అసలైనవేనని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నిర్ధారించింది. ఆ వీడియోలేవీ ఎడిట్ చేసిన, మార్ఫింగ్ చేసిన, తప్పుడు వీడియోలు కాదని స్పష్టం చేసింది.
వీడియోలో ఉన్న వ్యక్తి భౌతిక లక్షణాలు ప్రజ్వల్ రేవణ్ణను చాలా దగ్గరగా పోలి ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు సిట్‌కు నివేదిక సమర్పించింది. ఇప్పటి వరకు ప్రజ్వల్‌పై మూడు కేసులు నమోదయ్యాయి.