Obesity | న్యూఢిల్లీ, మార్చి 3: ఊబకాయాన్ని నిరోధించేందుకు, చికిత్స అందించేందుకు సరైన చర్యలు తీసుకోకపోతే 2035 నాటికి భారతీయ చిన్నారుల్లో ఆ సమస్య ఏటా 1.9 శాతం పెరుగుతుందని ప్రపంచ ఊబకాయ ఫెడరేషన్ హెచ్చరించింది. శనివారం ప్రపంచ ఊబకాయ దినం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన అధ్యయనం వివరాలను విడుదల చేసింది.
పరిస్థితులను నియంత్రించకపోతే 2035 నాటికి ప్రపంచ జనాభాలో సగానికిపైగా ఊబకాయం బారిన పడతారని తెలిపింది. ఈ సమస్య వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఏటా నాలుగు ట్రిలియన్ డాలర్ల ప్రభావం పడుతుందని వివరించింది. ఆఫ్రికా, ఆసియాలో తక్కువగా లేదా మధ్య ఆసియా దేశాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని తెలిపింది.