భోపాల్: నర్సులుగా శిక్షణ పొందుతున్న విద్యార్థులకు ఒక దాబా వద్ద ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. మొబైల్ ఫోన్లు, పుస్తకాలు చూసి కాపీ కొట్టారు. (Nursing Students Exam) నర్సింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఈ మోసాన్ని బయటపెట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఈ సంఘటన జరిగింది. జనరల్ నర్సింగ్, మిడ్వైఫరీ కోర్సు చేస్తున్న కొందరు విద్యార్థులు గ్వాలియర్-మోరెనా హైవేలోని దాబా వద్ద ప్రాక్టికల్ పరీక్షలు రాశారు. మొబైల్ ఫోన్లు, పుస్తకాల ద్వారా కాపీ కొట్టి చీటింగ్‌కు పాల్పడ్డారు.
కాగా, నర్సింగ్ స్టూడెంట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఉపేంద్ర సింగ్ గుర్జార్ కారులో మొరెనా నుంచి గ్వాలియర్‌కు ప్రయాణించారు. ఈ సందర్భంగా ఈటరీ వద్ద నర్సింగ్ విద్యార్థులు పరీక్షలు రాయడాన్ని ఆయన గమనించారు. ఆ స్టూడెంట్స్ వద్దకు వెళ్లి దీని గురించి నిలదీశారు. మీ నర్సింగ్ కాలేజీలో సీట్లు లేవా? పరీక్షలు ఇక్కడ ఎందుకు రాస్తున్నారు? అని ప్రశ్నించారు. దీనిని వీడియో తీశారు.
మరోవైపు జబల్పూర్ మెడికల్ యూనివర్సిటీ అధికారుల అండతో నర్సింగ్ కాలేజీ మాఫియాలు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నాయని ఉపేంద్ర సింగ్ గుర్జార్ ఆరోపించారు. నర్సింగ్ విద్యార్థుల భవిష్యత్తును వారు నాశనం చేస్తున్నారని విమర్శించారు. దీనిపై చర్యల కోసం సీఎంకు ఫిర్యాదు చేస్తానని అన్నారు. అలాగే నర్సింగ్ విద్యార్థులతో కలిసి భోపాల్‌లో భారీ నిరసన చేపడతానని వెల్లడించారు. కాగా, ఆయన రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#WATCH | MP: Medical Students Caught Writing Exam At ‘Dhaba’ In #Gwalior#MadhyaPradesh #MPNews #medicalstudent pic.twitter.com/AAq23WGljO
— Free Press Madhya Pradesh (@FreePressMP) December 12, 2024