న్యూఢిల్లీ, అక్టోబర్ 14 : భారత్లో 2022 ఏడాదితో పోల్చితే 2023లో జననాల సంఖ్య తక్కువగా, మరణాల సంఖ్య ఎక్కువగా నమోదైంది. ‘సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టం’ (సీఆర్ఎస్) ఆధారంగా రూపొందిన నివేదిక ప్రకారం, మనదేశంలో 2022లో జననాలు 2.54 కోట్లుకాగా, 2023లో 2.52కోట్లకు తగ్గింది. జననాల సంఖ్యలో 2,32,000 తగ్గుదల ఉందని నివేదిక పేర్కొన్నది.
అలాగే మరణాల సంఖ్య 2022లో 86.5 లక్షలు కాగా, 2023లో 86.6 లక్షలుగా ఉందని గణాంకాలు వెలువడ్డాయి. కొవిడ్-19 కారణంగా 2025 మే 5 నాటికి మొత్తం 5,33,665 మంది మరణించినట్టు నివేదిక తెలిపింది. దేశంలో ఒడిశా, మిజోరం, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఏపీలో అత్యధిక జననాలు నమోదయ్యాయి.